
బషీర్‌బాగ్, వెలుగు : సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయాలు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు... టీటీడీ పాలకమండలి పని చేస్తుందని ఆ బోర్డు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి...దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందించామని తెలిపారు.
ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి.. వాటిని అభివృద్ధి వైపు నడిపించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్లలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2,500కు పైగా ఆలయాలను నిర్మించామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డీవీఅర్కే ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.