భూపాలపల్లి రూరల్,వెలుగు: భూపాలపల్లి ఏరియా కాకతీయ ఖని బొగ్గు గనుల్లో నవంబర్ లో 68 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు. భవిష్యత్ లో ఏరియాకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక లక్ష్యాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
