స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం..రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి

స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం..రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి
  • రూ.12 లక్షలు పోగొట్టుకున్న భూపాలపల్లి వాసి

భూపాలపల్లి రూరల్, వెలుగు: స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసపోయిన ఓ వ్యక్తి రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణా కాలనీకి చెందిన ఓ ఉద్యోగిని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వైజర్లమంటూ కావ్య, సంధ్య వాట్సాప్​ ద్వారా సంప్రదించారు. 

పెట్టుబడి పెడితే 15 రోజుల్లో 50 శాతం లాభాలు పొందవచ్చని నమ్మించారు. ఆశపడిన బాధితుడు మొదట రూ.లక్ష పెట్టుబడి పెట్టాడు. దానికి వచ్చిన లాభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దశలవారీగా రూ.12 లక్షలు పెట్టేశాడు. అవతలి నుంచి రెస్పాన్స్​ లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. గురువారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.