నువ్వో బచ్చా.. పద్ధతి మార్చుకో! .. కేటీఆర్ పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఫైర్

నువ్వో బచ్చా.. పద్ధతి మార్చుకో! .. కేటీఆర్ పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఫైర్

హైదరాబాద్, వెలుగు: "కేటీఆర్ నువ్వో బచ్చా...పద్ధతి మార్చుకో!" అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవగాహన లేని కేటీఆర్.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ నేతలకు..కాంగ్రెస్ ప్రజా పాలనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పినా...కేటీఆర్ అహం మాత్రం తగ్గలేదన్నారు.

 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ..బీజేపీ లోపాయికారి ఒప్పందానికి సిద్ధం అవుతున్నారని గండ్ర సత్యనారాయణ  పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై బీఆర్ఎస్ ఎందుకు పోరాటం చేయడం లేదని కేటీఆర్  ను ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటానికి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని నిలదీశారు.