
శ్రీనగర్: ఇటీవల కాశ్మీర్‌లో కురిసిన వర్షాల దెబ్బకు అక్కడి ఆపిల్ రైతుల జీవనోపాధి సంక్షోభంలో పడిపోయింది. భారీ వర్షాలు, వరదలకు పలుచోట్ల నేషనల్ హైవేలు కొట్టుకుపోవడంతో ట్రాన్స్‌పోర్టుకు బ్రేక్ పడింది. దీంతో యాపిల్ పండ్ల లోడ్‌తో ఉన్న వేలాది ట్రక్కులు రోడ్లపైనే నిలిచిపోయాయి.
లోడ్ చేసిన పండ్లన్నీ కుళ్లిపోతుండటంతో రైతులు వాటిని రోడ్లపక్కన పారబోస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్ల కష్టం వృథా అవుతోందని, తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని యాపిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.