బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వల్లే గిరిజనుల జీవితాల్లో వెలుగులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వల్లే గిరిజనుల జీవితాల్లో వెలుగులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ, వెలుగు : గిరిజనుల జీవితాల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. రేగొండ మండలం రామన్నగూడెంలో గురువారం గిరిజనులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు. 

గిరి వికాసం పథకం కింద బోర్లు వేయిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ప్రజలు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రా, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, మటికె సంతోష్‌‌‌‌, రఘుసాల తిరుపతిరావు పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లా గణపురం తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి మాట్లాడారు. జర్నలిస్టులు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

 అక్రిడిటేషన్‌‌‌‌ ఉన్న ప్రతి జర్నలిస్ట్‌‌‌‌కు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రా, గణపురం పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, భూపాలపల్లి మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ పొలుసాని లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.