భూపతి చంద్ర అవార్డులు అభినందనీయం : సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి 

భూపతి చంద్ర అవార్డులు అభినందనీయం : సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి 

బషీర్​బాగ్, వెలుగు: భూపతి చంద్ర కొడుకులు తమ తల్లిదండ్రుల పేరిట స్మారక అవార్డులు అందజేయడం అభినందనీయమని సీనియర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి కొనియాడారు. ట్రస్ట్  చైర్మన్ ఎం.ఎల్ కాంతారావు అధ్యక్షతన అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల ప్రదానోత్సవ సభ-2025కు ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా నాగార్జున యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మన్నవ సత్యనారాయణ, ఆత్మీయ అతిథిగా సినీ దర్శకుడు బి.నరసింగరావు హాజరయ్యారు.

తీరని రుణం (చాగంటి ప్రసాద్ హైదరాబాద్) ప్రథమ బహుమతి గెలుచుకోగా, అనుకోని అతిథి( ఉప్పులూరి మధుపత్ర శైలజ) ద్వితీయ, కర్రెకోడి (కొండ మల్లారెడ్డి, సిద్దిపేట) తృతీయ,  సమీద (ఎం. శ్రీనివాసరావు), వెన్నెల రాగం (గొర్లివాని శ్రీనివాస్), సాగని పయనం (వాసవ దత్తరమణ), శారదా విజయం (ఎస్ గంగలక్ష్మి), ఏది ముఖ్యం (పప్పు శాంతాదేవి) ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. విజేతలను శాలువాతో సన్మానించారు.