మోడీకి మరో అరుదైన గౌరవం

మోడీకి మరో అరుదైన గౌరవం

థింపూ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని మోడీకి భూటాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని భూటాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆ దేశ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్ మోడీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

కరోనా విపత్తు సమయంలో తమ దేశానికి అందించిన మద్దతు, సాయానికి గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు భూటాన్ పీఎం ఆఫీస్ పేర్కొంది. భారత్, భూటాన్ మధ్య ఉన్న అవధుల్లేని స్నేహానికి ఇది అద్దం పడుతుందని జిగ్మే వాంగ్ చుక్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రేప్ ఎంజాయ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

మిస్ వరల్డ్ ఫైనల్స్ వాయిదా

ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు