
కన్నడ యాక్టర్ భువన్ పొన్నన్న హీరోగా ఓ రొమాంటిక్ మూవీ తెరకెక్కనుంది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల అంటే ఒకరో, ఇద్దరో ఉంటారు. కానీ భువన్ హీరోగా యాక్ట్ చేయనున్న సినిమాలో ఏకంగా 20మంది హీరోయిన్లు నటించనున్నారు. 1970లో విజయాన్ని సాధించిన రొమాంటిక్ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొల్లూరు ముకాంభికా మరియు లైక ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రణయ రాజా నిర్మాతగా, టీ. సుదర్శన్ చక్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘ ప్రణయ రాజా ‘ అనే టైటిల్ను ఖరారు చేసింది. ప్రస్తుతానికి 18 మంది హీరోయిన్లు ఈ సినిమాలో నటించడానికి కర్ణాటక, ముంబాయి, బెంగాల్ మరియు ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన నాయికలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.