
హైదరాబాద్: వెలుగు: బీఐసీ సెల్లో కొరియన్ పాప్, కొరియన్ -డ్రామా ఫౌంటెన్ పెన్నులను ప్రారంభించింది. వీటితో రాత చాలా బాగా వస్తుందని, గ్రిప్ బాగా ఉంటుందని తెలిపింది. ప్రభావవంతమైన దక్షిణ కొరియా వినోద పరిశ్రమకు నివాళులు అర్పించడానికి ఫౌంటెన్ పెన్నులను తీసుకొచ్చింది. కేపాప్ ఫౌంటెన్ పెన్నులు నాలుగు అద్భుతమైన రంగుల్లో లభిస్తాయని, వినియోగదారులు తమ ఆలోచనలు ఆలోచనలను కచ్చితత్వంతో, స్పష్టతతో వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తాయని కంపెనీ తెలిపింది. కే డ్రామా ఫౌంటెన్ పెన్నులు నాలుగు రంగుల్లో లభిస్తాయి. వీటి ధర రూ.50.