తెలుగులో బిచ్చగాడు-2కు భారీ బిజినెస్

తెలుగులో బిచ్చగాడు-2కు భారీ బిజినెస్

బిచ్చగాడు-2 మూవీ తెలుగులో భారీ బిజినెస్ చేస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా బిచ్చగాడుకు సీక్వెల్ గా వస్తన్న ఈ సినిమాపై తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతోంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకున్న నేపధ్యంలో.. దాదాపు ఏడేళ్ల తరువాత వస్తున్న ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

ఇక బిచ్చగాడు2 మూవీ తెలుగులో 6 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. బిచ్చగాడు పార్ట్ 1 తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. బిచ్చగాడు మూవీని చదలవాడ కృష్ణమూర్తి 2 కోట్లకు కొని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏకంగా 14.8 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.

దీంతో బిచ్చగాడు 2 మూవీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కచ్చితంగా ఈ మూవీకి సూపర్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు మేకర్స్. మే 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.