సైకిల్స్‌ అమ్మకాలు డబుల్

సైకిల్స్‌ అమ్మకాలు డబుల్

జైపూర్‌‌ : అయిదు నెలల్లో దేశంలో సైకిల్‌‌ సేల్స్‌‌డబులయ్యాయి. తక్కువ దూరాలు వెళ్లడానికి ఎక్కువ మంది సైకిళ్లనే ఇష్టపడుతుండటంతోనే అమ్మకాలు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్‌‌ 19 వ్యాప్తి భయంతోనే హెల్త్‌‌ సేఫ్టీ కోసం సైకిల్స్‌‌పై ఆధారపడుతున్నట్లు పేర్కొంటున్నాయి. డిమాండ్‌‌ భారీగా పెరగడంతో  తమకిష్టమైన సైకిల్‌‌ కోసం కొనుగోలుదారులు కొన్ని రోజులపాటు వెయిట్‌‌ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపాయి. ఇలాంటి ట్రెండ్‌‌ కనబడటం దేశంలో ఇదే మొదటిసారని, ఆరోగ్యంపై అవగాహన పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌‌ దాకా దేశంలో మొత్తం 41,80,945 సైకిల్స్‌‌ అమ్ముడైనట్లు ఆల్‌‌ ఇండియా బైసైకిల్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ (ఏఐసీఎంఏ) డేటా వెల్లడిస్తోంది. సైకిళ్లకు ఇంత డిమాండ్‌‌ పెరగడం ఊహించలేదని ఏఐసీఎంఏ సెక్రటరీ జనరల్‌‌ కే బీ ఠాకూర్‌‌ చెప్పారు. అయిదు నెలల్లోనే సైకిల్‌‌ సేల్స్‌‌ నూరు శాతం పెరిగాయని, తమ ఫేవరెట్‌‌ సైకిల్‌‌ కోసం బయ్యర్లు వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. మే నెలలో 4,56,818 సైకిల్స్‌‌ అమ్ముడవగా, జూన్‌‌ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 8,51,060 కి చేరిందని చెప్పారు.  ఇక సెప్టెంబర్‌‌లో ఏకంగా 11,21,544 సైకిళ్లు అమ్ముడయ్యాయని తెలిపారు. లాక్‌‌డౌన్‌‌ తర్వాత సైకిల్స్‌‌ అమ్మకాలు 15 నుంచి 50 శాతం పెరిగాయని ఆనంద్‌‌ సైకిల్‌‌ స్టోర్‌‌ (జైపూర్‌‌) ఓనర్‌‌ గోకుల్‌‌ ఖత్రి చెప్పారు. అత్యంత చవుకైన ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సాధనం కావడంతోపాటు, హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ కూడా ఉండటంతో సైకిల్స్‌‌ కొనేందుకు ఇష్టపడుతున్నారని అభిప్రాయపడ్డారు. రూ. 10 వేలు అంతకంటే ఎక్కువ ఖరీదైన సైకిల్స్‌‌ కొనుగోలు బాగా పెరిగిందని మానసరోవర్‌‌ ఏరియాలోని మరో షాప్‌‌ కీపర్‌‌ అన్నారు. కరోనా వైరస్‌‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌‌డౌన్‌‌ మాన్యుఫాక్చరర్లకు చాలా సవాళ్లనే తెచ్చింది. అన్‌‌లాకింగ్‌‌తో డిమాండ్‌‌ పెరగడం మొదలైందని, సప్లై చేయడమే ఇప్పుడు కష్టంగా మారిందని ఒక సైకిల్‌‌ మాన్యుఫాక్చరర్‌‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.