ఇండో అమెరికన్లను ఎన్ఐఏసీలో మెంబర్లుగా నియమించిన బైడెన్

ఇండో అమెరికన్లను ఎన్ఐఏసీలో మెంబర్లుగా నియమించిన బైడెన్

వాషింగ్టన్: మన దేశ మూలాలున్న మరో ఇద్దరిని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక పదవుల్లో నియమించారు. నేషనల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అడ్వయిజరీ కౌన్సిల్(ఎన్ఐఏసీ) మెంబర్లుగా మను ఆస్థానా, మధు బెరివాల్​ను అపాయింట్ చేసినట్లు గురువారం ప్రకటించారు. ఫిజికల్ దాడులు, సైబర్​ నేరాలను ఎలా తగ్గించాలనే విషయాలపై ఈ కౌన్సిల్ ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఎన్ఐఏసీలో పనిచేసేందుకు ఫైనాన్స్‌‌‌‌, రక్షణ, కమ్యూనికేషన్‌‌‌‌ తదితర రంగాల్లో విశేష అనుభవం ఉన్న 26 మందిని బైడెన్ సర్కారు అపాయింట్ చేసింది.

అందులో ఆస్థానా, బెరివాల్ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ మార్కెట్​లలో ఒకటైన నార్త్ అమెరికాలోని పీజేఎం ఇంటర్​ కనెక్షన్​కు మను ఆస్థానా సీఈవో, ప్రెసిడెంట్​గా ఉన్నారు. ఇన్నోవేటివ్‌‌‌‌ ఎమర్జెన్సీ మేనేజ్‌‌‌‌మెంట్​ సంస్థకు సీఈవోగా బెరివాల్ కొనసాగుతున్నారు.