ఫ్లైట్ ఎక్కుతూ తూలిపడ్డ బైడెన్

ఫ్లైట్ ఎక్కుతూ తూలిపడ్డ బైడెన్

వాషింగ్టన్ నుంచి అట్లాంటా వెళ్లేందుకు శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్ ఎక్కుతూ అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్ (78) రెండుసార్లు తూలిపడ్డారు. మొదటిసారి తూలగానే వెంటనే పైకి 
లేచిన ఆయన రెండోసారి పైకి లేవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ప్రెసిడెంట్ బైడెన్ కు ఎలాంటి గాయాలు కాలేదని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. ఆయన విమానం 
ఎక్కుతున్నప్పుడు గాలి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.