క్లర్క్ టు ప్రెసిడెంట్.. కష్టనష్టాలను ఎదుర్కొని ఎదిగిన బైడెన్

పేరు: జోసెఫ్​ రాబినెట్ బైడెన్ జూనియర్

వయసు: 77

పుట్టిన తేదీ: 1942 నవంబర్ 20

బర్త్ ప్లేస్: స్ర్కాంటన్, పెన్సిల్వేనియా

ఎడ్యుకేషన్: యూనివర్సిటీ ఆఫ్ ​డెలావేర్ నుంచి బీఏ, సిరకస్ యూనివర్సిటీ నుంచి లా

అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన జో బైడెన్… అంత ఈజీగా ఈ స్థాయికి చేరుకోలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థికంగా, ఫ్యామిలీ పరంగా, రాజకీయంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా గుండె నిబ్బరంతో నిలబడ్డారు. చివరకు అనుకున్నది సాధించి.. ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. బైడెన్ 1942 నవంబర్ 20న పెన్సిల్వేనియాలోని స్ర్కాంటన్ లో జన్మించారు. ఆయన తండ్రి సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ చేస్తుండేవారు. బైడెన్ కు 13 ఏండ్ల వయసులో ఆయన కుటుంబం డెలావేర్ కు షిఫ్ట్ అయింది. 1965లో యూనివర్సిటీ ఆఫ్​డెలావేర్ లో బీఏ పూర్తి చేసిన బైడెన్.. కొన్ని రోజులు క్లర్క్ గా పని చేశారు. 1968లో సిరకస్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

50 ఏండ్ల పొలిటికల్ కెరీర్..

బైడెన్ 1970లో తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. తొలిసారి న్యూ కెజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. 1972లో 29 ఏండ్ల వయసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున సెనెట్ కు ఎన్నికై, దేశ చరిత్రలోనే ఐదో యంగెస్ట్ సెనెటర్ గా గుర్తింపు పొందారు. 1973 నుంచి 2009 వరకు సెనేటర్ గా సేవలందించారు. సెనేట్ జ్యుడిషియరీ కమిటీ చైర్మన్ గా 16 ఏండ్లు, సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ గా 12 ఏండ్లు పని చేశారు. 2008 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైమ్ లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ బరాక్ ఒబామా… బైడెన్ ను తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలుపొందడంతో అమెరికా 47వ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. మళ్లీ 2012లోనూ పార్టీ గెలవడంతో రెండోసారి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అమెరికా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ డిస్టింక్షన్’’ను అప్పటి  ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేతుల మీదుగా అందుకున్నారు.

మూడుసార్లూ కలిసిరాలే…

బైడెన్ తొలిసారి 1988లోనే ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అప్పట్లో ఆయనపై ఆరోపణలు రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత 2007లోనూ బరిలోకి దిగారు. కానీ అప్పుడు బరాక్ ఒబామాకు చాన్స్ దక్కింది. మళ్లీ 2015లో అవకాశం వచ్చినప్పటికీ, ఆయన కొడుకు చనిపోవడంతో పోటీకి నిరాకరించారు.