చైనాపై ఉక్కుపాదం మోపిన బైడెన్ 

 చైనాపై ఉక్కుపాదం మోపిన బైడెన్ 
  • హవాయి కంపెనీతో అమెరికాకు ముప్పు హెచ్చరికపై అలర్ట్ 
  • 5 చైనీస్ కంపెనీలను సెక్యూరిటీ త్రెట్స్ లిస్టులో పెట్టిన అమెరికా

వాషింగ్టన్: చైనా విషయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ హయాంలో బ్యాన్ చేసిన 5 చైనీస్ కంపెనీలను తాజాగా బైడెన్ ప్రభుత్వం ‘నేషనల్ సెక్యూరిటీ త్రెట్స్’ లిస్టులో చేర్చింది. హవాయి, జడ్ టీఈ, హైటెరా కమ్యూనికేషన్స్, హ్యాంగ్జౌ హిక్విజన్ డిజిటల్ టెక్నాలజీ, డహువా టెక్నాలజీ కంపెనీలతో అమెరికా ప్రజలు, జాతీయ భద్రతకు ముప్పు ఉందని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్సీసీ)కి సంబంధించిన పబ్లిక్ సేఫ్టీ అండ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఐదు చైనీస్ కంపెనీల డివైస్లను టెలికమ్యూనికేషన్ సర్వీసులను అమెరికన్ కంపెనీలేవీ ఉపయోగించరాదని స్పష్టం చేసింది.  హవాయి, జడ్ టీఈ  కంపెనీల స్థానంలో సొంత ఎక్విప్ మెంట్, నెట్వర్క్లను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికన్ కంపెనీలకు 1.9 బిలియన్ డార్ల ఫండ్స్ ను రిలీజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ గత డిసెంబర్ లోనే ఆమోదం తెలిపింది.