బైడెన్ మనకు దోస్త్ అయితడా?

బైడెన్ మనకు దోస్త్ అయితడా?

న్యూఢిల్లీ: అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్​ ఇండియాతో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. బార్డర్​లో మనతో ఘర్షణకు దిగుతున్న  పాకిస్తాన్​, చైనా విషయంలో ఆయన స్టాండ్​ ఏంటన్నదానిపైనా చర్చ మొదలైంది. ​చైనాతో  బార్డర్ గొడవ విషయంలో ట్రంప్ మన వైపు ఉండి చైనాకు వార్నింగ్ ఇచ్చిండు. పాకిస్తాన్ కన్నా మనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్ కావడంతో.. ఆయన ఇండియాకు ట్రంప్ అంత మంచి దోస్త్ గా ఉండేది లేనిది కొద్ది రోజుల్లో తేలనుంది. బైడెన్ తో మనకు మంచిది కాదని కొందరు చెప్తుంటే.. ట్రంప్ దిగిపోయినా మనతో అమెరికా దోస్తానా అట్లే ఉంటదని మరికొందరు అంటున్నరు.  ప్రధాని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీర్ ను విభజించడాన్ని, సీఏఏ, ఎన్ఆర్సీలు తేవడాన్ని బైడెన్ తప్పుపట్టారు. కమలా హారిస్ కూడా ఈ విషయంలో అప్పుడు ఘాటుగా స్పందించారు.

కాశ్మీరీల హక్కుల కోసం అవసరమైతే జోక్యం చేసుకోవాలని కూడా ఆమె గతంలో కామెంట్ చేశారు. వీరిద్దరూ వస్తే కాశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా ఉండొచ్చని కొందరు చెప్తున్నరు. బార్డర్ గొడవ విషయంలో బైడెన్ మనకు ట్రంప్ అంత గట్టిగా సపోర్ట్ చేయకపోవచ్చని, రెండు దేశాలను చర్చలకు కూర్చోబెట్టేందుకు మాత్రం ప్రయత్నించొచ్చని భావిస్తున్నరు.

ట్రంప్ లాగే దోస్తీ చేయొచ్చు..

బైడెన్ ప్రెసిడెంట్ అయినా ఇండియా వర్రీ కావాల్సిన అవసరం లేదని, ఆయన కూడా ట్రంప్ లాగే మనతో దోస్తీ చేస్తారని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నరు. ప్రెసిడెంట్ మారినంత మాత్రాన మనతో అమెరికా దోస్తాన్ ఏమీ మారదని అంటున్నరు. బైడెన్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇండియాకు ఇంటర్నల్ విషయాలైన ఎన్ఆర్సీ, సీఏఏ, కాశ్మీర్ వంటి అంశాలను లేవనెత్తకుండా ఆయన సైలెంట్ అయిపోతారని పేర్కొంటున్నరు.

ఆక్రమణల విషయంలో చైనాపై ట్రంప్ పెద్దగా ప్రెజర్ పెట్టలేదని, బైడెన్ వచ్చినా చైనాపై ప్రెజర్ పెంచే ప్రయత్నం చేయకపోవచ్చని విశ్లేషిస్తున్నరు. పాకిస్తాన్ చైనాలు దగ్గర కావడం, చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరొచ్చినా.. ఇండియాతో దోస్తీ చేయక తప్పదని.. ఇప్పుడు బైడెన్ కూడా అదే చేస్తడని చెప్తున్నరు.