వైట్హౌస్లో కరోనా కలకలం 

వైట్హౌస్లో కరోనా కలకలం 

వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కరోనా కలకలం రేపుతోంది. యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒకరికి కొవిడ్ సోకింది. ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనా యంత్రాంగంలో ఓ ఉద్యోగికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి మూడ్రోజుల కింద బైడెన్ తో కలసి ప్రయాణించినట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన డాక్టర్లు.. బైడెన్ కు ఆదివారం యాంటీజెన్, తర్వాతి రోజు ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేశారు. రెండింటిలోనూ ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ ఆ ప్రకటనలో వెల్లడించింది. బైడెన్ కు బుధవారం మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. కాగా, అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. వారం వ్యవధిలోనే అక్కడ కేసులు అమాంతం పెరిగిపోయాయి. దీంతో అందర టీకా వేయించుకోవాలని.. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సూచించారు. 

మరిన్ని వార్తల కోసం: 

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో

పాక్ స్పిన్నర్ యాసిర్ షాపై కేసు 

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు