పాక్ స్పిన్నర్ యాసిర్ షాపై కేసు 

పాక్ స్పిన్నర్ యాసిర్ షాపై కేసు 

ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా చిక్కుల్లో పడ్డాడు. మైనర్ బాలిక రేప్ కేసులో యాసిర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారంటూ ఇస్లామాబాద్ కు చెందిన 14 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. షా, ఫర్హాన్ తనను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే  తన వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారని తెలిపింది. దీంతో యాసిర్ షాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై అతడు ఇంకా స్పందించలేదు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని.. వాస్తవాలు బయటకు వచ్చాకే దీనిపై స్పందిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కాగా, పాక్ తరఫున 46 టెస్టులు ఆడిన లెగ్ స్పిన్నర్ యాసిర్ షా.. 235 వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తల కోసం: 

దీని కోసమే నేను చాలా కష్టపడ్డా

26 వేల బుల్లెట్‌‌ బండ్లలో బ్రేక్ సమస్య

బండి అమ్మినా చలాన్లు వస్తుంటే.. ఇలా చేయండి