దీని కోసమే నేను చాలా కష్టపడ్డా

దీని కోసమే నేను చాలా కష్టపడ్డా
  • టఫ్​ టైమ్​లోనూ వెనక్కు తగ్గని  తెలుగు షట్లర్​ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఎన్ని ఓటములు వచ్చినా ప్రయత్నం, పోరాటం, నమ్మకంతో ముందుకు ఫలితమే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): ఒకే ఏడాది నాలుగు సూపర్​ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకొని ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగాడు. కానీ, ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవ్వలేక హీరో నుంచి జీరోగా మారిపోయాడు. షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెబితే గత నాలుగేళ్లలో తెలుగు షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీ ఇది. ఎంత స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యడో.. అంతే వేగంగా పడిపోయాడు ఈ గుంటూరు కుర్రాడు. అందుకే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హిస్టరీ క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయ్యడం అందరినీ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. కానీ, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వలేదు. ఈ విక్టరీతో తను పొంగిపోలేదు.    సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘దీని కోసమే నేను చాలా కష్టపడ్డా. ఈ రోజు నేనిక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా’ అన్నాడు.  తనపై తనకు ఎంత నమ్మకం ఉందో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ నమ్మకమే శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంతదూరం తీసుకొచ్చింది. ఎన్ని ఓటములు ఎదురైనా ఎక్కడా తగ్గకుండా.. పోరాటం ఆపకుండా ముందుకెళ్లాలన్న తపనే అతడి పేరును చరిత్రలో నిలిపింది. వరల్డ్​ చాంపియన్​షిప్​ఫైనల్లో ఓడినా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మునుపటి  శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూశారు. 
లేటుగా వచ్చి..
తన అన్న నందగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి 2001లో బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న శ్రీకాంత్​ దాదాపు పదేళ్లు డబుల్స్​ ఆడాడు. కానీ,  కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతడిని సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.  లేటుగా వచ్చినా సింగిల్స్​లో తనదైన మార్కు చూపించాడు శ్రీకాంత్​. 2013లో థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అతను.. 2014 చైనా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.  2016 రియో  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలనప్పటికీ 2017లో  శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు మార్మోగింది. ఆ ఏడాది ఐదు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాకయ్యేలా చేశాడు. 2018 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకొని ఔరా అనిపించాడు.
 

పోరాటం ఆపలేదు..

నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్​ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకోలేకపోయాడు. వారం రోజుల్లోనే దాన్ని చేజార్చుకున్న శ్రీ.. తర్వాత ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయాడు.  మోకాలు, చీలమండ గాయాలు ఆటలో వెనుకబడేలా చేసింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకున్నా టోక్యో ఒలింపిక్స్​ దృష్ట్యా  తొందరగా టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావాలని తను చేసిన ప్రయత్నాలు దెబ్బకొట్టాయి.  2019 ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పిస్తే.. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకూ ఒక్క టోర్నీలో కూడా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాలేకపోయాడు. మునుపటిలా దూకుడుగా ఆడితే మళ్లీ గాయం అవుతుందనే భయం అతడిని వెంటాడింది.  అయితే,  కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిదా పడటం, సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఆటకు గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ఈ గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచుకున్నాడు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్లు మళ్లీ మొదలయ్యాక  రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా వీలైనన్ని ఎక్కువ టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఏదేమైనా సరే పోరాటం ఆపకూడదని డిసైడయ్యాడు.  టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవ్వకపోయినా.. దిగులు చెందకుండా ముందుకెళ్లాడు. ఈ క్రమంలో ఈ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెంటో మొమోటాను ఓడించడం శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచింది. 

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు