
టాటా ఎంటర్‌ప్రైజ్ బిగ్‌బాస్కెట్, కరీంనగర్‌లో తన క్విక్ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. 10 వేల కంటే ఎక్కువ ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లో అందిస్తుంది.
వీటిలో తాజా పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్స్ ఇంకా పర్సనల్ కేర్ వస్తువులు ఉన్నాయి. ఈ సేవ వినియోగదారులకు ఇంట్లో నుంచే కిరాణా సామగ్రిని ఎంతో వేగంగా ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది.