గడ్కరీ, ఫడ్నవీస్ ఇలాఖాలో బీజేపీకి ఎదురుదెబ్బ

గడ్కరీ, ఫడ్నవీస్ ఇలాఖాలో బీజేపీకి ఎదురుదెబ్బ

మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇలాఖాలో బీజేపీ మద్ధతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగపూర్ నుంచి మహావికాస్ అఘాడి బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్, బీజేపీ ముఖ్య నేతల ఇలాఖాలో బీజేపీపై ఎంవీఏ పైచేయి సాధించడం సంచలనంగా మారింది.  రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా వైదొలిగిన తర్వాత జరిగిన కీలక ఎన్నికలు ఇవే. శాసనమండలిలో ఐదుగురు సభ్యుల ఆరేళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 7తో ముగియనుంది. ఇందులో మూడు ఉపాధ్యాయ, రెండు గ్రాడ్యుయేట్స్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే నాగ్‌పూర్‌లో టీచర్స్ సీటు నుంచి ఎంవీఏ తరఫున సుధాకర్ అద్బలే.. బీజేపీ మద్దతున్న నాగోగనార్ అభ్యర్థిపై విజయం సాధించారు.