
బిగ్బాస్ రియాలిటీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ఇనయా సుల్తానా (Inaya Sultana) ఒకరు. ఈ షో నుంచి ముందుగానే ఎలిమినేట్అయినా.. తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెగిటివిటీ లేకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చింది. కానీ, ఆ తర్వాత కూడా ఆమెకు ఆశించిన అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది.
దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ స్పందించింది. ‘సరైన గైడెన్స్ లేక నా లైఫ్‌లో అతిముఖ్యమైన ఏడేళ్ల కాలాన్ని నేను వేస్ట్ చేశాను. కొత్త తరం వారంతా16 ఏళ్లకే హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల, కృతిశెట్టి లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యే నాటిని నా వయసు 22. ఈ లెక్క ప్రకారం ఆ టైమంతా వేస్ట్ అయినట్టే. మహా అయితే ఈ కాలంలో ఓ 50 ఏళ్ల వరకు బతకడమే ఎక్కువ. అందుకే ఇక గతం గురించి బాధపడకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ ఇనయా వివరించింది.