
కడప జిల్లాలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. ఆదివారం (ఆగస్టు 10) లంకమల్ల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ల నుంచి రూ.కోటి విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. టన్ను ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు సీజ్ చేశారు.
ఆదివారం జరిపిన దాడిలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగదస్తగిరిరెడ్డిని అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నాగదస్తగిరి రెడ్డిపై 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు ఉన్నాయి. స్మగ్లర్ భార్య లూలుబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఢిల్లీలోని బడా స్మగ్లర్ కు ఎర్రచందనం దుంగలు సరఫరా చేస్తూ.. హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నట్లు తేలిందని అన్నారు. హవాలా వ్యాపారి విక్రమ్ సింగ్ సోలంకి వారం క్రితం అరెస్టు చేసినట్లు చెప్పారు.