న్యూక్లియర్ బాంబుల కన్నా ప్రమాదకరం: AI దారుణాలు సృష్టిస్తుంది..

న్యూక్లియర్ బాంబుల కన్నా ప్రమాదకరం: AI దారుణాలు సృష్టిస్తుంది..

కృత్రిమ మేధస్సు (AI) వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలపై రోజుకో చర్చ జరుగుతోంది. కొందరు దీనిని చాలా ఉపయోగకరంగా చూస్తుంటే, మరికొందరు ఈ టెక్నాలజీ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రముఖ సిని  దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా AI గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని కంట్రోల్ చేయకపోతే టెర్మినేటర్ లాంటి దారుణాలు సృష్టిస్తుందని అన్నారు. జేమ్స్ కామెరూన్ ప్రకారం, AI న్యూక్లియర్ ఆయుధాల వల్ల కలిగే నాశనాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రపంచ నాయకులు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. 

జేమ్స్ కామెరూన్ రోలింగ్ స్టోన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోస్ట్స్ ఆఫ్ హిరోషిమా గురించి స్పందిస్తూ AI ప్రమాదం గురించి మాట్లాడారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే సైనిక వ్యవస్థలలో AI వాడకం మనిషి అవగాహనకు మించిందన్నారు.  దీనిని మనిషి కంట్రోల్   చేస్తున్నప్పటికీ తప్పులు జరిగే ప్రమాదం ఉంది. దీని కోసం కఠినమైన రూల్స్ రూపొందించాలని, ఈ ప్రమాదాన్ని ఆపడానికి ప్రపంచ నాయకులు త్వరగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ప్రస్తుతం మానవ జాతి ఒకేసారి మూడు పెద్ద ప్రమాదలను ఎదుర్కొంటున్నదని కామెరాన్ అన్నారు. వాతావరణ మార్పు, అణ్వాయుధాల పెరుగుదల, సూపర్-ఇంటెలిజెంట్ AI అనేవి మూడు కీలక ముప్పులు. ఈ మూడు సమస్యలు ఒకేసారి భారీ స్థాయికి చేరుకున్నాయని,  ఇది చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని ప్రమాదాన్ని సృష్టిస్తోందని ఆయన అన్నారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ AI న్యూక్లియర్ స్థాయి విపత్తుకు కారణమవుతుందని 36% AI పరిశోధకులు నమ్ముతున్నారని అన్నారు. దీనితో పాటు చికాగో యూనివర్సిటీలో జరిగిన ఒక సమావేశంలో కూడా అణ్వాయుధాలతో AI సంబంధం దాదాపు అవును అని వెల్లడైంది. కాబట్టి, ఇలాంటి ప్రమాదలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

AI ఒక శక్తివంతమైన టెక్నాలజీ అని కామెరాన్ నమ్ముతు, దానిని జాగ్రత్తగా ఉపయోగించాలి. దీనిని ఆయుధాలలో దుర్వినియోగం చేస్తే అది మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారవచ్చు. ప్రజలు సినిమాల నుండి దీని ప్రమాదాలను అర్థం చేసుకోవాలి. 'గోస్ట్స్ ఆఫ్ హిరోషిమా' సినిమా చరిత్రలోని భయంకరమైన సంఘటనలను చూపించడమే కాకుండా, భవిష్యత్తులో మనం అలాంటి తప్పులు చేయకూడదని కూడా చెబుతుందన్నారు.