అన్నదమ్ముల అనుబంధానికి నెటిజన్లు ఫిదా

అన్నదమ్ముల అనుబంధానికి నెటిజన్లు ఫిదా

ఉద్యోగంలో చేరిన అనంతరం మొదటి జీతంతో ఇంట్లో వారికి లేదా,,, స్నేహితులకు ఎదైనా బహుమతులు కొనుగోలు చేయాలని అనుకుంటుంటారు. గిఫ్ట్ లు కొని వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. హృదయాలను హత్తుకునే కొన్ని వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తమ్ముడి పట్ల అన్న చూపిన ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. goodnews_movement ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు రెండు రోజుల్లో 261,598 లైక్స్ వచ్చాయి. 

చేతిలో ప్యాకేట్తో ఓ బాలుడు తన తమ్ముడు ఉన్న గదిలోకి వెళ్తాడు. ఆ సమయంలో బెడ్ పై నిద్రపోతున్న సోదరుడిని లేపేందుకు ప్రయత్నిస్తాడు. లేచిన అనంతరం తాను తీసుకొచ్చిన ప్యాక్ ను ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఉన్న స్నీకర్స్, సాక్సులను చూపించడంతో తమ్ముడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతాడు. లేచి అన్నను గట్టిగా కౌగిలించుకుంటాడు, షూ చూసిన అనంతరం మరోసారి అన్నను ప్రేమతో పట్టుకుంటాడు. తమ్ముడిని ప్రేమగా తలపై నిమిరి తొలుత సాక్స్ వేసుకోవాలని సూచిస్తాడు. ఆనందభాష్పాలు కారుస్తూ.. సాక్స్ వేసుకుంటాడు. 

ఈ వీడియోను చూసి నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. తల్లిని మెచ్చుకున్నారు. మొదటి జీతంతో అత్యంత సన్నిహితులు, ప్రియమైన వారిని సంతోష పెట్టండంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. తాము కూడా వచ్చిన మొదటి జీతంతో ఇంటి కుటుంబ సభ్యులకు ఇచ్చిన బహుమతుల గురించి పలువురు నెటిజన్లు ప్రస్తావించారు.