బిగ్​సీలో దసరా ఆఫర్లు

బిగ్​సీలో దసరా ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నామని మొబైల్స్​ రిటైల్ ​చెయిన్​ బిగ్​ సీ ఫౌండర్​ బాలు చౌదరి ప్రకటించారు. ప్రతి స్మార్ట్​ఫోన్​ కొనుగోలుపై రూ.10 వేల వరకు క్యాష్​బ్యాక్​తో పాటు రూ.నాలుగు వేల వరకు విలువైన కచ్చితమైన బహుమతి ఇస్తారు. ప్రతి మొబైల్, టీవీ, ల్యాప్​టాప్​ కొనుగోలుపై 5 శాతం ఇన్​స్టంట్​డిస్కౌంట్, స్మార్ట్​వాచ్​ఆఫర్​, లాయల్టీ పాయింట్స్​ఆఫర్​, 1+1 ఎక్స్​టెండెడ్​ ఆఫర్​ ఉంటాయి. బజాజ్ ​ఫైనాన్స్ ​ద్వారా మొబైల్స్​ కొంటే రూ.తొమ్మిది వేల వరకు ఇన్​స్టంట్​ క్యాష్ బ్యాక్​ వస్తుంది.

 ఎస్​బీఐ కార్డుతో  కొంటే రూ.మూడు వేల వరకు క్యాష్​బ్యాక్​, ఐసీఐసీఐ కార్డులతో కొంటే ఐదుశాతం క్యాష్​బ్యాక్​ ఉంటుంది. కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్​ కొంటే ఫైర్​బోల్ట్ ​స్మార్ట్​వాచీని రూ.299లకే ఇస్తారు. ప్రతి టీవీ కొనుగోలపై కచ్చితమైన బహుమతితో పాటు రూ.15 వేల విలువైన 100 వాట్ల బోట్​  స్పీకర్​ను రూ.5,699లకే ఇస్తారు.