
హైదరాబాద్, వెలుగు : బిగ్‌సీ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ ప్రకటించింది. బిగ్‌సీలో మొబైల్ కొనుగోళ్లపై రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు 5 కోట్ల క్యాష్ పాయింట్లు గెలుచుకునే అవకాశం ఉందని సంస్థ ఫౌండర్, సీఎండీ యం బాలు చౌదరి చెప్పారు. ఈ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. బిగ్‌సీలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు స్క్రాచ్ అండ్ విన్ ద్వారా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఓవెన్లు, ట్రాలీ సూట్‌కేసులు, మిక్సర్, రైస్ కుక్కర్ వంటి ఎన్నో గిఫ్ట్‌లు పొందవచ్చని చెప్పారు. మొబైల్ యాప్‌ను కూడా బిగ్‌సీ లాంచ్ చేసింది. ఒక మొబైల్ రిటైల్ సంస్థ యాప్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి అని బాలు చౌదరి చెప్పారు. తమ బిగ్‌సీ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ మొబైల్ ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిన 90 నిమిషాల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.