
హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగల సందర్భంగా తాము ప్రకటించిన ‘దసరావళి డబుల్ ధమాకా’ ఆఫర్‌కు మంచి స్పందన వస్తోందని బిగ్ సీ ఫౌండర్, సీఎండీ యం. బాలు చౌదరి చెప్పారు. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రతి 10 రోజులకు ఒక లక్కీ డ్రా తీస్తామని, ఇలా మొత్తం మూడు వారాలు చేపడతామని చెప్పారు. లక్కీ డ్రాల్లో విజేతలకు 30 మారుతీ ఆల్టో 800 కార్లు, 30 బజాజ్ ప్లాటినా బైక్‌లను గిఫ్ట్‌లుగా అందిస్తామన్నారు. ఈ లక్కీ డ్రాతో పాటు 10 శాతం హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్‌ను, ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మొబైల్ కొన్న వారికి ఒక ఈఎంఐ ఉచితం, 30 శాతం పేటీఎం క్యాష్‌బ్యాక్, జీరో పర్సెంట్ డౌన్‌పేమెంట్ సౌకర్యం, వన్‌ప్లస్ మొబైల్స్ కొనుగోలుపై 3000 వరకు హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తామని తెలిపారు. గత నెల 30తో మొదలైన ఈ ఆఫర్ ఈ నెల 29తో ముగుస్తుంది. బుధవారం ఈ ఆఫర్ తొలి లక్కీ డ్రాను తీసి, విజేతలను ప్రకటించారు.