నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్గొండ జడ్పీ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు బీఆర్ఎస్ రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా పెద్దవూర మండల జడ్పీటీసీ కృష్ణారెడ్డి, గుర్రంపోడ్ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, త్రిపురారం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సుమారు 200 మంది ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్ళందరూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి అత్యంత దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. నల్గొండ పార్లమెంట్ సన్నాహా సమావేశానికి గుత్తా అమిత్ రెడ్డికి పార్టీ నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వీరంతా ఏప్రిల్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.