ఎన్టీఆర్ బర్త్‌డేకు ఇంకా నెలరోజుల సమయం ఉండగానే ఇప్పట్నుంచే ఫ్యాన్స్ అంతా ఆయన అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన బర్త్‌డే (మే 20)కు ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు అప్‌డేట్స్ వస్తాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారట.
అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు ఆ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరోవైపు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబోను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ గురించి గత కొన్నిరోజులుగా గాసిప్స్ వినిపిస్తుండగా దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర2’ గురించి కూడా క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇలా నాలుగు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఏమేర ట్రీట్ ఇవ్వనున్నాడో తెలియాలంటే బర్త్‌డే వరకు వేచి చూడాల్సిందే.

