జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బిగ్ ట్విస్ట్..BRS అభ్యర్థి కూతురు అక్షరపై కేసు

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బిగ్ ట్విస్ట్..BRS అభ్యర్థి కూతురు అక్షరపై కేసు

హైదరాబాద్​: జూబ్లీహిల్స్​ బైపోల్స్​ప్రచారంలో బిగ్​ ట్విస్ట్​.. బీఆర్​ ఎస్​ అభ్యర్థి, అమె కూతురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్​ ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరపై కేసు నమోదు చేశారు. A1 మాగంటి సునీత, A2మాగంటి అక్షర, మరికొంతమంది బీఆర్ ఎస్​ నేతలపై కేసులు నమోదు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. 

జూబ్లీహిల్స్​ బైపోల్స్​కు అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే  బీఆర్​ ఎస్​ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. యూసుఫ్​ గూడ డివిజన్​ పరిధిలోని వెంకటగిరిలో ఓటు వేయాలని బీఆర్​ ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరతోసహా పలువురు పార్టీ నేతలు ప్రభావితం చేశారని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు. 

శుక్రవారం రోజు నమాజు చేసి వెళ్తున్న ఓటర్లను ప్రభావితం చేశారంటూ..A1 మాగంటి సునీత, A2మాగంటి అక్షర, మరికొంతమంది బీఆర్ ఎస్​ నేతలపై కేసులు నమోదు చేశారు. 

జూబ్లీహిల్స్​ బైపోల్స్​ కు సోమవారం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్​11న  ఎన్నికలు జరగనున్నాయి.  నవంబర్​ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు.