తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR దగ్గర OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్27) జూబ్లీహిల్స్ PSకు రాజశేఖర్ రెడ్డిని పిలిపించి సిట్ అధికారులు రెండు గంటల పాటు విచారించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.
ఇటీవల SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను జూబ్లీహిల్స్ SIT అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావుతోపాటు పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. 2023 లోసుమారు 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో 618 మంది పొలిటికల్ లీడర్లు ఉన్నారు. వీళ్లతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టుల నెంబర్లు కూడా ఉన్నాయని సెట్ తేల్చింది. అప్పటి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని విచారిస్తోంది సిట్.
