
ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. తారక్(Tarak) కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) సినిమాపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు(మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్బంగా ఈ క్రేజీ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కేజీఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
దాదాపు సంవత్సరంన్నర క్రితం ఈ అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కంబోని సెట్ చేసింది. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వాళ్ళ ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ ఎన్టీఆర్ 31పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. ఎన్టీఆర్ 31 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలుకానుందట. అంటే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నిజానికి తారక్ మరే సినిమాకు రాని క్రేజ్ ఈ సినిమాకు వచ్చింది. కారణం.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అవడం.అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే మాసీవ్ టైటిల్ ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, అందులో విలన్ పాత్ర ఒకటని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి రిలీజ్ తరువాత ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.