
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో కంటెస్టెంట్స్ మధ్య అప్పుడే వార్ మొదలైంది. ఒకరికొకరు వార్నింగ్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఈ వార్నింగ్స్ పీక్స్ చేరుకున్నాయి. రతికా(Rathka) అండ్ దామిని(Damini) మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకుంది. నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్స్ ఇచ్చుకున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు మొదటి వారం మొదటి టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ టాస్క్ లో ఇంటి సభ్యులు ఐదు వారల ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నారు. టాస్క్ లో భాగంగా అందరు ముందు పహిల్వాన్స్ తో తలపడ్డ సంగతి తెలిసిందే. అందులో ఆట సందీప్ అండ్ ప్రియాంకలు విన్ అయ్యారు. మిగిలిన వారి నుండి మరొకరికి కూడా ఆ ఛాన్స్ పొడవచ్చు అంటూ వారికి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రతిక, శివాజీ, ఉన్నారు.
కాబట్టి మొత్తం నాలుగు సందీప్,ప్రియాంక,రతికా,శివాజీ ఇమ్యూనిటీ కోసం పోటీపడుతున్నారు. అందులో ఎవరికీ ఆ అర్హత ఉంది అంటూ మళ్ళీ కంటెస్టెంట్స్ నే అడిగాడు బిగ్ బాస్. అందులో చాలా మంది రతికకు ఆ అర్హత లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగానే దామిని కూడా రతికాకి ఆ అర్హతలేదు అంటూ చెప్పుకొచ్చింది. మధ్యలో తనకు మాలిన ధర్మము తగదు మదిలో సుమతి అంటూ శివాజీ అన్నారు. దానికి బదులుగా దామిని దీన్ని ఎందుకు అంతలా లాగుతున్నారో అర్థంకావడం లేదు అంది. అంతేకాదు నాకు వంద రీజన్స్ ఉన్నాయి అది నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది దామిని. దాంతో కాస్త హార్ట్ అయినా రతికా దామినికి నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంతకీ ఇమ్యూనిటీ ఎవరికీ వచ్చింది అనేది తెలియాలంటే మాత్రం ఇవాళ్టి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.