సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి అంతా ఉల్టా పుల్టా!

సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి అంతా ఉల్టా పుల్టా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)కు రంగం సిద్ధమైంది. ఈసారి షోను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ చాలానే కష్టపడుతున్నారు. గత సీజన్ లో వచ్చిన నెగిటీవ్ కామెంట్స్ రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. అందుకోసం షో ప్రమోషన్స్ నుండే సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. 

ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో చివరి నిమిషంలో కథను మార్చేసే కింగులా నాగార్జున(Nagarjuna) కనిపించారు. కథ మాములుగా సాగిపోతే ఏం మజా ఉంటుంది.. ట్విస్టులు ఉండాలి కదా అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రోమో చివరిలో.. ఎవరి ఊహకు అందని సీజన్.. బిగ్ బాస్ సీజన్7 అంత  ఉల్టా పుల్టా అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ఈ సీజన్ పై ఆసక్తిని పెంచింది. 

ఇవన్నీ చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ టీమ్ ఎదో కొత్తగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక కంటేస్టెంట్ ల విషయంలో కూడా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. త్వరలోనే ఈ సీజన్  ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సీజన్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పించనుందో చూడాలి.