తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతున్న వేళ..ఈ షోలో పాల్గొనే వారెవరూ అనేది ఇంట్రెస్టింగ్ టాక్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పర్సనాలిటీస్‌ను బిగ్ బాస్ 8 ఇంట్లోకి పట్టుకొచ్చేలా ఉన్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.ఆ వివరాలు చూస్కుంటే..
ALSO READ | Bigg Boss OTT 3: హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్3 విజేతగా సనా మక్బుల్..ప్రైజ్ మనీ ఎంతంటే?
యువ హీరో రాజ్ తరుణ్, కమెడియన్ ప్రభాస్ శ్రీను,యాదమ్మ రాజు,యాంకర్ వింధ్య, యూట్యూబర్ నిఖిల్, వేణు స్వామి, కుమారీ ఆంటీ, అమృతా ప్రణయ్,అలాగే యాంకర్ విష్ణుప్రియ, నటి రీతు చౌదరి, బంచిక్ బబ్లూ, నేత్ర, బర్రెలక్క, సోనియా సింగ్, మై విలేజ్ షో అనిల్, బుల్లెట్ భాస్కర్, ఖయ్యూం అలీ, శ్వేతా నాయుడు (ఢీ ఫేమ్), సాకేత్ (సింగర్), శ్రీకర్ (సీరియల్ నటుడు), అక్షిత (నీతోనే డాన్స్), రవి శివ తేజ (కమెడియన్) వంటి వారు బిగ్ బాస్ 8 సీజన్‌లో సందడి చేస్తారని లీకులు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ కొత్త సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్నదానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇకపోతే, బిగ్ బాస్ 7 తెలుగులో ఓ రైతుబిడ్డగా వచ్చి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్.
నిజానికి బిగ్ బాస్ అనేది ఒక క్రేజీ షో. పరిచయం లేని కొంతమందిని ఒక ఇంట్లో ఉంచి. టైం, మొబైల్ తో సంబంధం లేకుండా, వారికి చిన్న చిన్న టాస్కులు పెడుతూ, మధ్యలో గొడవలు పెడుతూ..దాదాపు 100 రోజులపాటు సాగే ఆటనే ఈ బిగ్ బాస్. మరి ఈ సీజన్ 8 ఎలా ఆసక్తిగా మారనుందో చూడాలి.