
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకి ఇస్తున్న ప్రతినెల పెన్షన్ పెంచుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. దింతో అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇప్పుడు నెలకు రూ.15,000 పెన్షన్ అందనుంది, అయితే గతంలో ఇచ్చే రూ.6000 కంటే రెండింతలు పైగా పెరగటం విశేషం.
అంతేకాకుండా, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, మరణించిన వ్యక్తి భార్యకు ప్రతి నెల రూ.10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. వీరికి గతంలో నెలకు రూ.3000 ఇచ్చేవారు. సమాజంలో జర్నలిస్టుల కీలక పాత్ర ఉందని, సమాజ అభివృద్ధికి వారి సేవలు ఎంతో ముఖ్యమని నితీష్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సూచనలు సంబంధిత శాఖకు కూడా తెలియజేశామన్నారు.
బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ రూ.6,000కి బదులు రూ.15,000 ప్రతినెల పెన్షన్ అందించాలని శాఖకు సూచనలు ఇచ్చామని, అలాగే బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం రూ.3,000 కాకూండా రూ.10,000 ప్రతినెల పెన్షన్ ఇవ్వాలని కూడా సూచనలు ఇచ్చాము. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం ఇంకా సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. జర్నలిస్టులు జర్నలిజంను నిష్పాక్షికంగా నిర్వహించడానికి, పదవీ విరమణ తర్వాత కూడా గౌరవంగా బ్రతకడానికి మేము మొదటి నుండి జర్నలిస్టుల సౌకర్యాలను చూసుకుంటున్నాము అని సీఎం నితీష్ Xలో పోస్ట్ చేశారు.
मुझे यह बताते हुए खुशी हो रही है कि बिहार पत्रकार सम्मान पेंशन योजना के तहत अब सभी पात्र पत्रकारों को हर महीने 6 हजार रू॰ की जगह 15 हजार रू॰ पेंशन की राशि प्रदान करने का विभाग को निर्देश दिया है। साथ ही बिहार पत्रकार सम्मान पेंशन योजना के अंतर्गत पेंशन प्राप्त कर रहे पत्रकारों की…
— Nitish Kumar (@NitishKumar) July 26, 2025
వీటితో పాటు నితీష్ కుమార్ చేసిన ఇతర ప్రకటనలు కూడా చేసారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతు మహిళలకు ప్రతినెల పెన్షన్ రూ.400 నుండి రూ.1100 పెంచారు. అలాగే 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ప్రకటించారు. ఈ నిర్ణయం 1 ఆగస్టు 2025 నుండి అమల్లోకి వస్తుంది అలాగే జూలై బిల్లు నుండే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. బీహార్ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలను కూడా ప్రకటించింది.