బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకం కావాల్సిందే 

బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకం కావాల్సిందే 

తాను ప్రధాని పదవిని కోరుకోవట్లేదని  బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన.. సీపీఐ, సీపీఎం కార్యాలయాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులను కలిశారు. లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిస్తే.. అది గొప్ప విషయం అన్నారు నితీశ్ కుమార్. తాను అసలు ప్రధాని పదవికి హక్కుదారుడ్ని కాదన్నారు. తమ పార్టీ కార్యాలయానికి నితీశ్ రావడం సంతోషంగా ఉందని సీతారం ఏచూరి అన్నారు. ఇది దేశరాజకీయాల్లో ఇది సానుకూల సంకేతం అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు.

దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని  సీపీఐ నేత డి.రాజా అన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అదే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన వెంట మేము.. ఆయన మాతోనే ఉంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.