కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు

కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు

బీహార్ కు చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన శనివారం పొద్దున జరిగింది. బీహార్ వైశాలి జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ రాకేశ్ కుమార్ ప్రతీరోజులాగే.. ఈరోజు కూడా జిమ్ కు వెళ్లారు. అయితే జిమ్ లోపలికి వెళ్తున్న రాకేశ్ పై బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గన్ తో ఫైర్ చేశారు. దీంతో రాకేశ్ అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

రాకేశ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించడానికి హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. పోలీసు వాహణాలను ద్వంసం చేశారు. స్థానికంగా ఉన్న దుఖానాలను దోచుకున్నారు. టైర్లను కాల్చి విసిరివేశారు.