ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే పర్మిషన్ తప్పనిసరి

ప్రభుత్వ ఉద్యోగులు రెండో  పెళ్లి  చేసుకోవాలంటే పర్మిషన్ తప్పనిసరి

రెండోవ వివాహాం చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే తమ సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అంటూ బిహార్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం  తీసుకువచ్చింది.  అధికారులు అనుమతి  వచ్చిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

భార్య/భర్త బతికి ఉండగానే, అలాగే విడాకులు తీసుకోకుండానే  ఇటీవల చాలామంది రెండో పెళ్లిళ్లు చేసుకుంటుండడం, ఆపై ఉద్యోగం, పెన్షన్‌, సంబంధిత వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..  రెండో వివాహం చేసుకునే ఏ ఉద్యోగి అయినా ముందుగా విడాకులు అయిన విషయాన్ని, భార్య/భర్త చనిపోయిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

అలా కాకుండా రెండో  పెళ్లి చేసుకుంటే..  రెండో భార్య/భర్తకు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు అందవని తెలిపింది.  అలాంటి సమయంలో మొదటి భాగస్వామి ద్వారా పిల్లలు ఉంటే.. వాళ్లకే ప్రాధాన్యత ఇస్తుందని బిహార్‌ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.