బిహార్ లో మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహం..

బిహార్ లో మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహం..
  • ప్రభుత్వం అందించే సాయం 10 వేల నుంచి 2 లక్షలకు పెంపు

పాట్నా: బిహార్ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘సీఎం మహిళా రోజగార్ యోజన’ కింద అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10 వేల నుంచి  రూ.2 లక్షల వరకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. లబ్ధిదారుల పనితీరు ఆధారంగా ఈ అదనపు మొత్తాన్ని అందించనున్నది. గురువారం సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల వర్క్ మోడల్స్ ను అంచనా వేసి దశలవారీగా పెంచిన మొత్తాన్ని విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.