ఇసుక మాఫియా దౌర్జన్యం.. ఇసుక చల్లి, కర్రలు, రాళ్లతో మహిళా ఆఫీసర్‌పై దాడి

 ఇసుక మాఫియా దౌర్జన్యం..  ఇసుక చల్లి, కర్రలు, రాళ్లతో మహిళా ఆఫీసర్‌పై దాడి

బీహార్ లోని పాట్నా బిహ్తా పట్టణంలో అక్రమ ఇసుక తవ్వకాలపై తనిఖీపై వచ్చిన మైనింగ్ శాఖకు చెందిన మహిళా అధికారిణిపై ఓ ముఠా దాడి చేశారు. ఆమెను లాగి, రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ కేసులో 44 మంది అరెస్టు, 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పాట్నా ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. మహిళా అధికారిణిపై దాడికి సంబంధించి మరికొందర్ని అరెస్టు చేసే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.

ఇసుక తవ్వకాలపై తనిఖీ చేయడానికి వచ్చిన జిల్లా మైనింగ్ అధికారిణిపై ఓ మాఫియా ముఠా దాడి చేసింది. ట్రక్కులు ఓవర్ లోడ్‍తో వెళుతున్నాయని, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన మైనింగ్ శాఖ బృందం, బిహ్‍టా పోలీసు సిబ్బందిపై.. ఆ సమయంలోనే అధికారులపై ఇసుక మాఫియా సభ్యులు దాడి చేశారు. పోలీసులపై ఇసుక చల్లి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అధికారులను వెల్లగొట్టేందుకు నానా హంగామా చేశారు. ఈ క్రమంలోనే ఇసుక మాఫియా సభ్యులు మహిళా ఆఫీసర్ వెంట పడడంతో ఆమె కిందపడి, గాయపడ్డారు. ఈ ఘటనలో జిల్లా మైనింగ్ అధికారిణి, ఇద్దరు మైనింగ్ ఇన్‌స్పెక్టర్లు సహా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు.

https://twitter.com/ANI/status/1647966337191546880