డిప్యూటీ మేయర్‭గా పారిశుధ్య కార్మికురాలు

డిప్యూటీ మేయర్‭గా పారిశుధ్య కార్మికురాలు

బీహార్ గయా ఓటర్లు చరిత్ర సృష్టించారు. ఓ పారిశుధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ కుర్చీలో కూర్చోబెట్టారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన గయా మున్సిపాలిటీలో తొలిసారి పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  

గయా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో చింతాదేవి ఘన విజయం సాధించారు. గతంలో ఆమె మానవ వ్యర్థాలను శుభ్రం చేసే వారు. ఆ తర్వాత రోడ్లు ఊడ్వడం, డ్రైనేజీలు, మ్యాన్ హోళ్లు శుభ్రం చేశారు. పారిశుద్ధ్య పనులు చేసే చింతాదేవి ఆ తర్వాత కూరగాయలు కూడా అమ్మింది. తాజాగా ప్రజల ఆశీర్వాదంతో చింతాదేవి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైంది. గయాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమికాదు. అత్యంత అట్టడుగున ఉన్న ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీదేవి, 1996లో నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ నుండి పోటీ చేసి గయా నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.