బీజాపూర్ జిల్లా ఎన్ కౌం టర్ మృతుల గుర్తింపు... నవంబర్11 న నేషనల్ పార్క్ లో ఘటన

బీజాపూర్ జిల్లా  ఎన్ కౌం టర్ మృతుల గుర్తింపు... నవంబర్11 న నేషనల్ పార్క్  లో ఘటన

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​జిల్లా నేషనల్​పార్కు లో ఈనెల 11న జరిగిన ఎన్​కౌంటర్ లో  మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. గురువారం బీజాపూర్​ఎస్పీ జితేంద్ర కుమార్​యాదవ్​వివరాలు తెలిపారు. మృతులు మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి కన్నా అలియాస్​బుచ్చన్న (రూ.8లక్షల రివార్డు),  కమాండర్​ఊర్మిళ (రూ.8లక్షల రివార్డు), ఏరియా కమిటీ మెంబర్​ మోటూ అలియాస్​జగత్​తామో(రూ.5లక్షల రివార్డు), సభ్యులు దేవే, భగత్, మంగళి ఓయాం (రూ.2లక్షల చొప్పున రివార్డు)లుగా గుర్తించారు. ఘటనా ప్రాంతంలో 2 ఇన్సాస్​లు, 9 ఎంఎం కార్బన్​, 303 రైఫిల్, మందు పాతరలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.