చైన్ స్నాచింగ్ కి ప్రయత్నంచి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని నంగ్లోయ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. గత నెల 30న ఓ మహిళ తన కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు వారి మెడలోని గోల్డ్ చైన్ ను దొంగలించబోయారు. బైకు వెనుకసీటుపై ఉన్న వ్యక్తి ఆ మహిళ మెడలో నుంచి సక్సెస్ ఫుల్ గానే చైన్ లాగాడు. కాని ఆ బైక్ ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించడంతో వెనుక కూర్చున్న వ్యక్తి ఆ మహిళ చేతికి చిక్కాడు
అంతే ఆ మహిళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దొంగ చేయిని గట్టిగా పట్టుకుని క్రిందకు లాగింది. ఆమె కూతురు కూడా అతన్ని పట్టుకొని చావగొట్టింది. ఇదంతా గమనించిన బైక్ నడిపే వ్యక్తి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది జనం అసలు దొంగను కుమ్మేశారు. తర్వాత దొంగను పోలీసులకు అప్పగించారు ప్రజలు. అతను ఇచ్చిన సమాచారంతో పారిపోయినవాడిని కూడా పట్టుకున్నారు. వాళ్ల దగ్గర్నుంచి మూడు బైక్ లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
#WATCH: Bike borne chain snatchers caught red-handed by a woman and her daughter in Nangloi, Delhi on August 30. The chain snatchers were later arrested by police. pic.twitter.com/vdLpztOKYw
— ANI (@ANI) September 3, 2019
