తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం

తిరుపతిలో  శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం

తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై ఉన్న డివైడర్  ను  ఢీ కొట్టిన  ద్విచక్రవాహనం కింద పడిపోయింది.

  ఈ ఘటనలో  ద్విచక్ర వాహనంపై వెళ్తున్న  ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.  సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు కనుక్కుంటున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు