బెంగళూరు సిటీలో రోడ్లు ఇంత ఘోరమా.. నిండు ప్రాణం పోయింది !

బెంగళూరు సిటీలో రోడ్లు ఇంత ఘోరమా.. నిండు ప్రాణం పోయింది !

బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ స్కిడ్ కావడంతో అన్నాచెల్లెళ్లు కిందపడిపోగా, అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆ దారిలో వస్తున్న లారీ చెల్లె పైనుంచి దూసుకెళ్లి ఆమె చనిపోయింది. ఈ ఘటన శనివారం (అక్టోబర్ 25) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో బెంగళూరు రూరల్ జిల్లాలోని మదనాయకహల్లి–హస్కర్ రోడ్డులో జరిగింది. 

ప్రియాంక (26) అనే యువతి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నది. ఆమె తన అన్నతో కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై శనివారం బయటకు బయలుదేరింది. అన్న బైక్ నడుపుతుండగా, చెల్లె వెనుక కూర్చున్నది. ప్రస్తుతం రిపేర్ వర్క్ జరుగుతున్న మదనాయకహల్లి-–హస్కర్ రోడ్డులో వాళ్లు ప్రయాణం చేస్తుండగా.. ఏపీఎంసీ దగ్గర గుంతను తప్పించబోయి బైక్ స్కిడ్ అయి కిందపడిపోయారు. 

అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆ రూట్‌‌‌‌‌‌‌‌లో వస్తున్న లారీ ప్రియాంక పైనుంచి దూసుకెళ్లడంతో ఆమె స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. ప్రియాంక అన్న హెల్మెట్ పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.