అర్ధరాత్రి టీ హబ్ రోడ్​లో స్టంట్లు

అర్ధరాత్రి టీ హబ్ రోడ్​లో స్టంట్లు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రోడ్లపై బైక్​లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న ఆరుగురు యువకులను రాయదుర్గం  పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీ హబ్ రోడ్​లో బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

తెల్లవారుజామున 2 గంటలకు టీ హబ్ రోడ్ వద్దకు వచ్చిన ఎస్​వోటీ పోలీసులు.. లంగర్ హౌస్ కు చెందిన షేక్ సల్మాన్(21), అఫ్రోజ్ ఖాన్(20), మహ్మద్ సొహైల్(20), ఇమ్రాన్ ఖాన్, మీర్ సొహైల్(20), మహ్మద్ ఇమ్రాన్(21)ను అదుపులోకి తీసుకొని రాయదుర్గం పీఎస్​కు తరలించారు. వీరి నుంచి 3 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.