కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో 288 దరఖాస్తులను ఆమె స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను అదేశించారు. అడిషనల్ కలెక్టర్లు లత, రాజ గౌడ్‌తో కలిసి ప్రజల నుంచి 24 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం థరూర్ క్యాంపులోని ఈవీఎం గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ఆఫీసులో నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ అశోక్‌కుమార్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 149 దరఖాస్తులు వచ్చాయన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అర్జీదారుల నుంచి 28 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
